పిల్లలకు ఆపద వస్తే తల్లి ఎంతకైనా తెగిస్తుంది. ఇదే విషయాన్ని రుజువు చేసింది ఓ ఎలుక. వరద నీటిలో చిక్కుక్కుపోయిన తన పిల్లలను కాపాడటం కోసం ప్రాణాలను పణంగా పెట్టి కాపాడింది ఆ తల్లి ఎలుక. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
ఆ ఎలుక ఏం చేసిందంటే..?

తన పిల్లలతో కలుగులో నివసిస్తోంది ఓ మూషికం. వానాకాలం కావడం వల్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ ఎలుక ఉన్న కలుగులోకి వరద నీరు చొచ్చుకు వచ్చింది. అప్రమత్తమైన ఆ మూషికం తన పిల్లలను వరద నీటి నుంచి కాపాడటానికి తీవ్రంగా శ్రమించింది. వర్షం నీటితో నిండిపోతున్న కలుగులోకి దూరి ఒక్కొక్క పిల్లను నోటితో పట్టుకొని బయటకు తెస్తూ.. వాటిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకొచ్చింది. కన్న పిల్లల ప్రాణాలను కాపాడుకుంది ఆ తల్లి ఎలుక. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి:తమిళనాడులో కొత్తగా 4,965 కరోనా కేసులు