తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వీయ నిర్బంధం.. అమ్మతో బలపడుతున్న బంధం - మాతృ దినోత్సవం

అమ్మతో కాసేపు సమయం గడిపితే ఒత్తిళ్లు అన్నీ దూరమవుతాయి. ఆమెతో మాట్లాడితే సమస్యల భారం తగ్గుతుంది. అమ్మతో ఉండటం ఎంతో ప్రత్యేకమని లింగ, వయో భేదాలు లేకుండా అందరూ అంగీకరిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాలంలో అమ్మను మించిన మిత్రుడు లేడు. ఆదివారం మాతృ దినోత్సవం సందర్భంగా కొంతమంది తమ అనుభవాలు ఇలా పంచుకున్నారు.

LOCKDOWN-MOTHER'S DAY
మాతృ దినోత్సవం

By

Published : May 10, 2020, 6:05 AM IST

బాలీవుడ్​లో​ భారీ విజయం సాధించిన చిత్రాల్లో 'కభీ కుషీ కభీ ఘమ్' ఒకటి. ఈ చిత్రంలో షారుక్​ ఖాన్​ ఎంట్రీ.. తన సినిమాల్లోకెల్లా అత్యుత్తమైనదిగా చెప్పుకొంటారు. కారణం అమ్మ సెంటిమెంట్ అంతలా పండింది.

చిత్రంలో తన తల్లిగా నటించిన జయాబచ్చన్​ను ఆశ్చర్యపరిచేందుకు హెలికాప్టర్​ దిగి పరిగెత్తుకుంటూ వస్తాడు షారుక్. కానీ జయాబచ్చన్​ అప్పటికే హారతి పళ్లెంతో గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ సన్నివేశం అమ్మ ప్రేమను చక్కగా ఆవిష్కరించింది.

అమ్మ చెప్పిన శుభ్రతే ఆశీర్వాదం..

ఇదే విధంగా తన తల్లికి సర్​ప్రైజ్​ ఇవ్వాలనుకుంది జమ్మూకు చెందిన సోనాలి పూరి. ముంబయి- జమ్మూ విమానంలో ఇంటికి చేరుకుంది. ఆమె ఊహించినట్లుగానే గుమ్మం ముందు సోనాలి వాళ్ల అమ్మ ఎదురుచూస్తోంది. అయితే చేతిలో హారతికి బదులుగా శానిటైజర్​ ఉంది. కరోనా కాలంలో శుభ్రతే ఆశీర్వాదం అనుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లింది సోనాలి.

ఈ ఘటన లాక్​డౌన్​ అమలుకు ముందు మార్చిలో జరిగింది. అప్పటి నుంచి జమ్మూలోనే ఉంది సోనాలి. కరోనా సెలవుల వల్ల చాలా రోజుల తర్వాత తన తల్లితో అధిక సమయం గడిపే అవకాశం కలిగిందని చెబుతోంది. చిన్నప్పటి విశేషాలన్నీ నెమరువేసుకుంటూ గడిపేస్తున్నట్లు తెలిపింది.

"కొన్నేళ్ల తర్వాత మాతృ దినోత్సవం నాడు అమ్మతో గడిపే అవకాశం కలిగింది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. 10 ఏళ్ల కాలంలో అమ్మతో ఇంత సమయం ఉన్న దాఖలాలే లేవు. కార్డ్స్​ ఆడటం, పాత చిత్రాలు చూడటం, వంట, పాటలు, నృత్యాలు.. పోట్లాటలు కూడా భాగమే. మళ్లీ బాల్యంలోకి వెళ్లినట్లు అనిపిస్తోంది. ఆమ్మ చెంత ఉంటే వర్క్​ ఫ్రమ్​ హోం ఒత్తిడి కూడా దరిచేరట్లేదు. "

- సోనాలి పూరి

కరోనాను అరికట్టేందుకు మార్చి 25న దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్​డౌన్ విధించింది కేంద్రం. అనంతరం దానిని మే 3వరకు.. తిరిగి మే 17 వరకూ పొడిగించారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ స్థిరమైన జీవితాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న కారణంగా సోనాలి లాంటి వాళ్లు ఇళ్లకే అంకితమయ్యారు. వారి కుటుంబం ఎక్కడుంటే అదే ఇల్లు. లేదా అమ్మ ఎక్కడుంటే అదే కుటుంబం.

లాక్​డౌన్​ కారణంగా చాలామంది తమ తల్లికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఫోన్​లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఏవో ప్రశ్నలు అడుగుతూనే ఉంటున్నారు. కొత్త వంటకాలు నేర్చుకోవడం, రోజంతా ఏం జరిగిందో చర్చించుకోవటం ఇలా.. అమ్మతో సమయం గడిపేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

లాక్​డౌన్​ కాలంలో అమ్మే మంచి స్నేహితురాలని చెప్పేందుకు చాలా మంది వద్ద అనేక కారణాలు ఉన్నాయి.

తల్లి చాటు బిడ్డగా..

ఈ సమయంలో తను పూర్తిగా తల్లి చాటు బిడ్డగా మారిపోయాయని 27 ఏళ్ల రమాంశ్​ అనే న్యాయవాది అంగీకరిస్తున్నారు. కిరాణా సామాను కొనుగోలు, వంట చేయటమే కాకుండా ప్రాథమిక విషయాలకు సంబంధించి పఠాన్​కోట్​లో ఉన్న అమ్మ సలహా కోరుతున్నానని చెబుతున్నారు.

"నేను ఈ మధ్యే నా వృత్తిరీత్యా దిల్లీకి వచ్చాను. నేను ఇలా వచ్చానో లేదో దిల్లీతో పాటు దేశమంతా నిద్రాణస్థితికి చేరుకుంది. ఈ లాక్​డౌన్​ సమయంలో మా అమ్మకు ఎన్నిసార్లు కాల్​ చేశానో లెక్కే లేదు. నాకే అన్నిసార్లు ఎవరైనా ఫోన్​ చేస్తే బ్లాక్​లిస్ట్​లో పెట్టేవాడ్ని. కానీ అమ్మ కదా.. అలా చేయదు. అందుకే నేను ఈ సమయంలో స్పానిష్ గుడ్లతో నేర్చుకున్న ఒక వంటకాన్ని విందుగా ఇస్తానని అమ్మకు ప్రమాణం చేశాను."

- రమాంశ్, న్యాయవాది

ఈ సమయంలో చాలా అవసరం..

హరియాణాకు చెందిన సిమి గుప్తాది మరో కథ. ఆమె ఏడు నెలల గర్భిణి. ఈ సమయంలో ఆమె తల్లి తన వద్ద లేకపోవటంపై ఆందోళన చెందుతోంది. గర్భిణికి మరో తల్లి అవసరం ఎంతో ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం వాళ్ల అమ్మకు వీడియో కాల్స్​ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటోంది. లాక్​డౌన్​ ఎత్తివేయగానే అమ్మ వస్తుందన్న ఆశాభావంతో ఉంది సిమి.

ఇలా ఇంటింటికీ ఎన్నో విషయాలు. అమ్మతో గడిపే సమయం అన్ని సమస్యలను దూరం చేస్తుందని చెప్పేందుకు ఇవి చిన్నపాటి ఉదాహరణలు మాత్రమే. ఇంట్లో ఉండటం ఎంతో ప్రత్యేకమని లింగ, వయో బేధాలు లేకుండా అందరూ అంగీకరిస్తారు. ఇంట్లో లేకపోయినా.. అమ్మతో కాసేపు మాట్లాడితే అన్ని రకాల ఒత్తిళ్లు దూరమవుతాయి.

ఇవాళ మార్చి 10, ఆదివారం... మాతృ దినోత్సవం.

ABOUT THE AUTHOR

...view details