తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దారుణం: చిన్నారికి మద్యం తాగించి హింసించిన తల్లి - Nandhini had an extramarital affair with a person called Ashokan.

మూడేళ్ల చిన్నారికి కన్నతల్లే మద్యం తాగించి, తీవ్రంగా హింసించిన ఘటన తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. భర్త నుంచి విడిపోయి.. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి మద్యం సేవించి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

Mother tortures her toddler by pouring alcohol
గోరుముద్దలు పెట్టాల్సిన అమ్మ.. మద్యం​ తాపింది!

By

Published : Jan 22, 2020, 11:40 AM IST

Updated : Feb 17, 2020, 11:18 PM IST

తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందిని అనే మహిళ మూడేళ్ల వయసున్న కన్నకూతురికి మద్యం తాగించి, అతికిరాతంగా హింసించింది. భర్త నుంచి విడిపోయిన ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మంగళవారం ఇద్దరు కలిసి మద్యం సేవించిన అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఏం జరిగింది?

నందినికి మాదేశ్​ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. అయితే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల నందిని తన కూతురుతో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

ఈ క్రమంలో ఆమెకు అశోకన్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. మంగళవారం ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అనంతరం మూడేళ్ల చిన్నారికి కూడా బలవంతంగా ఆల్కాహాల్​ నోట్లో పోసి తీవ్రంగా కొట్టింది నందిని. బాధను తట్టుకోలేక ఆ చిన్నారి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు చిన్నారిని రక్షించి, వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాలిక శరీరంపై తీవ్ర గాయలైనట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గోరుముద్దలు పెట్టాల్సిన అమ్మ.. మద్యం​ తాపింది!

ఇదీ చూడండి: సెంట్రల్​ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత

Last Updated : Feb 17, 2020, 11:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details