తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. భర్తతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డ ఓ భార్య.. తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా అదే విధంగా అత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ కలహాలు...
మిలవసల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పండి. ఐదేళ్ల క్రితం.. అదే ప్రాంతానికి చెందిన తమిళ్సెల్వీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దంపతులు ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు. 27వ తేదీ రాత్రి.. వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తమిళ్సెల్వీ అనూహ్యంగా తన పిల్లలు వర్ష శ్రీ, వర్ణిక శ్రీలపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. అనంతరం ఆమె కూడా అదే విధంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఆ చిన్నారులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయారు. కాలిన గాయాల ఉన్న తమిళ్సెల్వీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా ప్రాణాలు విడిచింది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేశారు. తమిళ్సెల్వీ ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్తను పట్టుకోవడానికి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి:-భార్యపై ఐపీఎస్ దాడి.. విధుల నుంచి సస్పెండ్