తెలంగాణ

telangana

ETV Bharat / bharat

40రోజుల పసికందును గొంతు కోసి చంపిన తల్లి - Mother killed her baby

తొమ్మిది నెలలు కడుపులో మోసిన కన్నతల్లే తన బిడ్డను పొట్టనపెట్టుకుంది. పెంచిపోషించాల్సిన ఆ అమ్మే.. కూతురి ప్రాణాలు తీసింది. ఊహ తెలియకముందే ప్రపంచానికే దూరం చేసింది. 40రోజుల ఓ పసికందును.. తల్లే అతి కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన బంగాల్​లో జరిగింది.

Mother killed 40 day old girl child at Murshidabad in West Bengal
40రోజుల పసికందును కిరాతకంగా హతమార్చిన తల్లి!

By

Published : Oct 9, 2020, 4:10 PM IST

బంగాల్​ ముర్షీదాబాద్​ జిల్లా బెర్హమ్​పుర్​లో అమానవీయ ఘటన జరిగింది. కన్న తల్లే 40రోజుల పసికందును గొంతుకోసి అతి కిరాతకంగా చంపింది. అనంతరం తప్పించుకునేందుకు యత్నించి, గ్రామస్థులకు దొరికిపోయింది.

నిందితురాలు చైతాలి(పసుపు పచ్చని చీర)

నిందితురాలు చైతాలి మండల్​కు కొంతకాలంగా మతిస్థిమితం లేనట్టు తెలుస్తోంది. మరోసారి ఆడపిల్ల పుట్టినందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని స్థానికులు చెప్పారు.

రెండేళ్ల క్రితం చైతాలి ఓ ఆడబిడ్డకు జన్మనివ్వగా అప్పుడే ఆ పాప చనిపోయిందట. ఆ తర్వాత మరోసారి కూతురే పుట్టింది. అప్పటి నుంచి చైతాలి మానసిక క్షోభకు గురువుతోందని స్థానికులు అంటున్నారు.

పోలీసులు చైతాలిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:భార్య తల నరికి పోలీస్ స్టేషన్​కు పట్టుకెళ్లిన భర్త

ABOUT THE AUTHOR

...view details