తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారు కుటుంబం కోసమే... ప్రజా శ్రేయస్సు పట్టదు' - భాజపా

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం అవినీతిని పతాకస్థాయికి చేర్చిందని ధ్వజమెత్తారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు కంటే కుటుంబ రాజకీయాలే వారికి ముఖ్యమని తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తర కర్ణాటక గంగావతిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

ప్రధాని

By

Published : Apr 12, 2019, 7:11 PM IST

కాంగ్రెస్-జేడీఎస్​ కూటమి కమీషన్ల కూటమిగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు 10 శాతంగా ఉన్న కమీషన్ ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నందు వల్ల 20 శాతానికి చేరిందని విమర్శించారు.

సార్వత్రిక ఎన్నికలను జాతీయవాదానికి వారసత్వానికి మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు ప్రధాని. కాంగ్రెస్, జేడీఎస్ రెండూ కుటుంబం కోసం పని చేస్తున్నాయే తప్ప ప్రజలు గురించి ఆలోచించడం లేదన్నారు.

దేశంలో మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయి, కేంద్రంలో మరోసారి ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మోదీ.

భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ. 2014 ఎన్నికల సమయంలోనూ కుమారస్వామి తండ్రి దేవెగౌడ ఇదే తరహా వ్యాఖ్యలు చేసి ఇప్పటి వరకు సన్యాసం తీసుకోలేదని ఎద్దేవా చేశారు. వారు ఇచ్చిన మాట మీద నిలబడతారని ప్రజలు విశ్వసించరని మోదీ విమర్శించారు.

ఎన్నికల సభలో మాట్లాడుతున్న మోదీ

" 2019 ఎన్నికలు జాతీయవాదానికి, వారసత్వ రాజకీయాలకు మధ్య జరిగే పోరు. దేశం ప్రథమమా లేక కుటుంబం ముందా?... ఇవి ఈ రెండింటికి మధ్య జరిగే ఎన్నికలు. కర్ణాటకలో కుటుంబ రాజకీయాలకు ప్రసిద్ధి కాంగ్రెస్, జేడీఎస్. రెండు పార్టీలు ప్రజలను విస్మరించి సొంత కుటుంబాలను ఉద్ధరించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రజల అవసరాలు, దేశ ప్రయోజనాలు వాళ్లకు పట్టవు. వారితో సహా వాళ్ల కుటుంబ స్వార్థమే వారికి ముఖ్యం. వాళ్ల మిషన్ ఒక్కటే.. అదే కమీషన్​."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

ఇదీ చూడండి: 'ఎవరు కావాలి.. హీరోనా? అవినీతిపరులా?'

ABOUT THE AUTHOR

...view details