ప్రస్తుత లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల్లో అత్యధికులు వ్యవసాయదారులే ఉన్నారు. కొత్త లోక్‌సభ ఏర్పడిన ప్రతిసారీ సభ్యుల వృత్తులను వర్గీకరించడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం సభ్యులు 116 రకాల వృత్తుల్లో ఉన్నారు. కొందరు రెండు మూడు వృత్తుల జాబితాలలో కనిపించారు. వ్యవసాయం వృత్తిగా 189 మంది ఉండగా.. సామాజిక సేవ (202), వ్యాపారం (95), న్యాయవాదులు (43), రైతులు (35), విద్యావేత్తలు (27), వైద్యులు (26), పారిశ్రామికవేత్తలు (24), రచయితలు (17), ఇంజినీర్లు (14), రాజకీయాలు (12), బిల్డర్లు (10) ఉన్నారు. ఇంకా సివిల్ సర్వెంట్లు 9 మంది, సినీనటులు 8, కళాకారులు, పాత్రికేయులు ఏడుగురు చొప్పున ఉన్నారు.
ప్రముఖులు ఏయే వృత్తుల నుంచి వచ్చారంటే..
1. ప్రధాని నరేంద్ర మోదీ: సామాజిక సేవ
2. హోంమంత్రి అమిత్‌షా: సామాజిక కార్యకర్త, రైతు
3. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: బోధన