బిహార్, ఝార్ఖండ్, బంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోని జిల్లాలకు వైరస్ నుంచి అధిక ముప్పు పొంచి ఉందని ఓ ప్రజా ఆరోగ్య సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతాల్లో వైరస్ రోగులను గుర్తించడం కూడా ఆలస్యమవుతోందని పేర్కొంది.
కర్ణాటకలోని ఉత్తర జిల్లాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని తూర్పు జిల్లాలు.. ఓ మోస్తరుగా వైరస్ బారిన పడే అవకాశముందని అధ్యయనం వెల్లడించింది. కేరళ, హిమాచల్‌ప్రదేశ్, హరియాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని అధిక జిల్లాల్లో వైరస్ ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం జరిపిన సంస్థ తెలిపింది.