తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రంగంలో  'అమిత్​ షా'నే బెస్ట్​ ఫినిషర్​..!

రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర ప్రతిష్టంభన.. చివరకు ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ బ్రేక్​ పడింది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిద్దామని శివసేన అలంకరించుకునేలోపే.. భాజపా వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. మరి ఇంత ఉత్కంఠగా సాగిన రాజకీయాలపై నెట్టింట ఎలాంటి ప్రజా స్పందన నెలకొందో ఓ లుక్కేద్దామా?

ఆ రంగంలో  'అమిత్​ షా'నే బెస్ట్​ ఫినిషర్​..!

By

Published : Nov 24, 2019, 5:21 AM IST


'అరేవా.. ఈ ఎన్నికలు బిగ్​బాస్​ కంటే ఆసక్తికరంగా ఉన్నాయి డ్యూడ్..'

'అబ్బబ్బా.. ఏమి ఎత్తులు, ఏమి ట్విస్టులు... క్రికెట్​ చూస్తున్నంత ఉత్కంఠగా ఉంది.'

'వారి వారి రంగాల్లో.. వారిద్దరే అసలు సిసలైన ముగింపు ఆటగాళ్లు అని నాకు పుట్టబోయే పిల్లలకు చెప్తా'

'పెద్దన్న మాట్లాడినప్పటికంటే.. ఏమీ మాట్లాడనప్పుడే.. ప్రతిపక్షాలు భయపడేలా చేశారే.'

'కొద్ది రోజులుగా టీవీ సీరియల్​లా సాగుతూనే ఉన్నా.. డ్రామా, ఉత్కంఠ, ట్రయాంగిల్​ లవ్​, దుఃఖం కలగలిపిన ఇలాంటి చిత్రాన్ని బాలీవుడ్ కాదు కదా.. హాలీవుడ్ కూడా నిర్మించలేదు.'

అవును.. మీరు ఊహించింది నిజమే. ఈ మాటలన్నీ మహారాష్ట్ర రాజకీయ మలుపుపై ట్విట్టర్​లో సామాన్య ప్రజానీకం పోస్ట్​ చేసినవే.

ఎన్​సీపీ, శివసేన, కాంగ్రెస్​ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అందరూ అనుకున్నారు. కానీ మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పడేసరికి అవాక్కయిన నెటిజన్లు.. ట్వీట్​లు, రీట్వీట్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లతో ట్విట్టర్​ను హోరెత్తించారు.

ఆ రంగంలో 'అమిత్​ షా'నే బెస్ట్​ ఫినిషర్​..!

షా ఇచ్చిన షాక్​పై...

భాజపా ఎత్తుగడను.. హెచ్​బీఓ ఛానల్​లో ప్రసారమైన ప్రముఖ వెబ్​ సిరీస్​ "గేమ్​ ఆఫ్​ థ్రోన్స్"లోని ఆఖరి మలుపులాగా, ఎంతో ఉత్కంఠగా ఉందని ఒకరు వివరిస్తే.. మరొకరు అమిత్​ షా 'చాణక్య' తెలివితో ధోనీలాగే ఆటకు 'అసలైన ముగింపునిచ్చే ఆటగాడి'గా నిరూపించుకున్నారు అని ట్వీట్ చేశారు.

ఆ రంగంలో 'అమిత్​ షా'నే బెస్ట్​ ఫినిషర్​..!

క్రికెట్​లో ధోనీ.. రాజకీయాల్లో అమిత్​ షాను ఎవరూ మించలేరని కొందరు వ్యాఖ్యానించారు.

కూటమిపై..

శివసేన, కాంగ్రెస్​, ఎన్సీపీ కూటమి పరిస్థితిపై... 'అయ్యో నోటికొచ్చిన కూడు చేయి జారిందే' అని ట్విట్టర్​లో కొందరు జాలి చూపితే, మరికొందరు 'పాప ఫలం అనుభవిస్తున్నారంటూ' దెప్పిపొడిచారు.

ట్విట్టింట మెరిసిన హ్యాష్​ట్యాగ్​లు

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ట్విట్టర్​లో కొన్ని హ్యాష్​ట్యాగ్​లు బాగా ట్రెండ్​ అయ్యాయి. అందులో #మహారాష్ట్ర రాజకీయాలు, #దేవేంద్ర_ఈజ్​_బ్యాక్​, #అమిత్​షా_బెస్ట్​_ఫినిషర్​ #మహా_కిచిడీ_సర్కార్​, #చాణక్య, #సంజయ్​ రౌత్​, #అమిత్​షా, #మోటాభాయి, #గేమ్​_ఆఫ్​_థ్రోన్స్ వంటివి విరివిగా వాడేశారు. ​

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5157096_sang-4.JPG

ఇదీ జరిగింది...

ఎన్నికల ఫలితాలు విడుదలైన అక్టోబర్ 24 నుంచి దాదాపు నెల రోజులపాటు సాగిన మహారాష్ట్ర సీఎం సీటు సమరం.. థ్రిల్లర్​ సినిమాను తలపించింది. శివసేన-భాజపా మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయనుకున్నారు. కానీ సేన 'చెరిసగం ఫార్ములా' వల్ల అది కుదరలేదు. ప్రభుత్వ గడువు ముగిసింది. గవర్నర్​ ఒక్కో పార్టీని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరినా పార్టీలన్నీ విఫలమయ్యాయి. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు గవర్నర్​.

అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం సీటుపై జెండా పాతేద్దామనుకుంది శివసేన. కానీ అదే సమయంలో సేన సహా ఎన్సీపీ-కాంగ్రెస్​కు భాజపా ఊహించని షాక్​ ఇచ్చింది. శరద్​పవార్​ సోదరుని కుమారుడు అజిత్ పవార్​తో కలిసి.. ఎన్సీపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్​, ఉప ముఖ్యమంత్రిగా అజిత్​ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ​ ​

ఇదీ చదవండి:మహా పీఠం తెర వెనుక కీలక పాత్ర?

ABOUT THE AUTHOR

...view details