మహిళల వివాహ వయసు పెంచొద్దంటూ వందకుపైగా పౌర సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. వయో పరిమితి పెంచడం వల్ల మహిళలకు ఒనగూరే ప్రయోజనాల కంటే కీడే ఎక్కువ జరుగుతుందని పేర్కొన్నాయి. మహిళల కనీస వివాహ వయసు పరిమితిని ప్రస్తుతమున్న 18 సంవత్సరాల నుంచి పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనిపై ప్రత్యేక కార్యచరణ దళాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
'మహిళల వివాహ వయసు పెంచితే కీడే ఎక్కువ'
మహిళల వివాహ వయో పరిమితిని 21 ఏళ్లకు పెంచొద్దని 100కు పైగా పౌర సంఘాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అలా చేస్తే కీడే ఎక్కువ జరుగుతుందని తెలిపాయి. మహిళా సాధికారతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నాయి. వీలైతే పురుషుల వివాహ కనీస వయసును కూడా 18 సంవత్సరాలకు తగ్గించాలని.. ప్రపంచంలో చాలా దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పాయి.
అయితే పరిమితి పెంపు వల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని పౌర సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. పురుషులతో పాటు.. మహిళల వివాహ వయసును కూడా 21 సంవత్సరాలు చేస్తే స్త్రీ-పురుష సమానత్వం రాదని.. పైగా మహిళా సాధికారతకు భంగం వాటిల్లుతుందని అంటున్నాయి. వీలైతే పురుషుల వివాహ కనీస వయసును కూడా 18 సంవత్సరాలకు తగ్గించాలని.. ప్రపంచంలో చాలా దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని తెలిపాయి. వయసు పరిమితి పెంచే బదులు.. మహిళలు ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. పరిమితి పెంచడం వల్ల బాల్య వివాహాలు ఆగిపోవని.. పైగా తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని తెలిపాయి.