తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2021, 9:02 AM IST

ETV Bharat / bharat

200 మంది కేరళ విద్యార్థులకు కరోనా!

కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న 200 మందికి పైగా కేరళ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అయితే ఇది కొత్త రకం వైరస్​ అనే అనుమానం ఆందోళన కలిగిస్తోంది.

More than 200 Kerala students in Mangaluru tests positive for coronavirus till now!
అక్కడ 200 మంది కేరళ విద్యార్థులకు కరోనా!

కర్ణాటక మంగళూరు నగరంలో చదువుతోన్న 200 మందికి పైగా కేరళ విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. ముందు జాగ్రత్త చర్యగా వీరందరి నమూనాలను బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. ఇది కొత్తరకం కరోనానో కాదో తేలాల్సి ఉంది.

స్ట్రెయిన్​ కేసులు..

ఇటీవల ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చిన కొందరిలో కొత్తరకం కరోనా (స్ట్రెయిన్) వెలుగుచూసింది. బ్రిటన్ నుంచి కేరళకు వచ్చిన ప్రయాణికుల్లోనూ ఈ వైరస్​ను కనుగొన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:'25శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు'

ABOUT THE AUTHOR

...view details