రాబోయే పంచాయతీ ఎన్నికలతో గుజరాత్లో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు స్థానిక ఎన్నికల్లో గెలిచి పార్టీల బలం నిలుపుకోవాలని చూస్తూన్న తరుణంలో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలింది. ఆనంద్ జిల్లాలోని ఖండలి గ్రామానికి చెందిన 1500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు భాజపా జిల్లా ఇంఛార్జి జయద్రాత్ సింగ్ పర్మార్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా ఉన్న భరత్ సోలంకి, ఖండలి సర్పంచ్, ఆనంద్ జిల్లా పంచాయతీ నిర్మాణ కమిటీ ఛైర్మన్ రాజేంద్రసింహ్ గోహిల్లు కాంగ్రెస్ను వీడిన ముఖ్యనేతల్లో ఉన్నారు.