తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనా రికవరీ రేటు 64.4 శాతం - తెలంగాణలో రికవరీ రేటు

భారత్​లో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరగడం ఊరట కలిగిస్తోంది. కరోనా బారినుంచి 10 లక్షల మంది కోలుకోగా.. రికవరీ రేటు 64.4 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.

recovery rate
రికవరీ రేటు

By

Published : Jul 30, 2020, 4:39 PM IST

ఏప్రిల్​లో 7.85 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 64.4 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. దేశంలో 10 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు.

ఈ స్థాయిలో రికవరీ రేటుకు కారణం వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అని భూషణ్​ తెలిపారు. 16 రాష్ట్రాల్లో రికవరీ రేటు దేశ సగటు కన్నా ఎక్కువ ఉన్నట్లు భూషణ్ వివరించారు.

రాష్ట్రం రికవరీ రేటు
దిల్లీ 88 శాతం
లద్దాఖ్ 80 శాతం
హరియాణా 78 శాతం
అసోం 76 శాతం
తెలంగాణ 74 శాతం
తమిళనాడు 73 శాతం
గుజరాత్ 73 శాతం
మధ్యప్రదేశ్ 69 శాతం
గోవా 68 శాతం

దేశంలో కరోనా వైరస్​ అంతకంతకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 52,123 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. కరోనా ధాటికి 34,968 మంది మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details