తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపానులకు పేర్లు ఎప్పటినుంచి పెడుతున్నారు?

ఏదైనా తుపాను వచ్చిందంటే దానికి తగిన పేరు పెట్టడం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకప్పుడు ఇలా పేర్లు పెట్టేవారు కాదు. తుపానుకు పేర్లు పెట్టే సంస్కృతి ఉత్తర హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాం.

By

Published : May 4, 2019, 7:05 AM IST

తుపానులకు పేర్లు ఎప్పటినుంచి పెడుతున్నారు?

తుపానులకు పేర్లు ఎప్పటినుంచి పెడుతున్నారు?

మాలా, హెలెన్​, నీల​గిరీస్​, నీలోఫర్​ ఇవన్నీ వింటుంటే ఒకప్పటి బాలీవుడ్​ తారల పేర్లుగా ఉన్నాయి కదూ... కానీ కావు...., జనావాసాలపై ప్రచండ గాలులు, భారీ వర్షాలతో విధ్వంసం సృష్టించే తుపానుల పేర్లే ఇవి. తాజాగా ఒడిశాను చిగురుటాకులా వణికించిన 'ఫొని' తుపాను శుక్రవారం తీరం దాటింది. బంగ్లాదేశ్​ వైపు మరింత బలంగా పయనమైంది.

తుపానుకు పేరెలా పెట్టారు?

కొద్దికాలం క్రితం వరకు తుపాన్లకు పేరుండేది కాదు. అయితే, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుపానులకు పేర్లు పెట్టాలని ప్రపంచ వాతావరణశాఖ, పసిఫిక్​ ప్యానెల్​లు 2000వ సంవత్సరంలో నిర్ణయించుకున్నాయి. ఒమన్​ దేశంలోని మస్కట్​లో జరిగిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం తెలిపాయి.

బంగాళాఖాతం, అరేబియా సముద్రాల తీరప్రాంతాలైన 8 దేశాల సమాలోచనల అనంతరం 2004 సెప్టెంబర్​లో ఉత్తర హిందూ మహా సముద్రంలో సంభవించే​ తుపానులకు పేర్లు పెట్టడం ప్రారంభించారు.

అదే సమయంలో బంగ్లాదేశ్​లో 'ఓనిల్​' తుపాను సంభవించింది. దీంతో ఉత్తర హిందూ మహా సముద్రం తీరప్రాంతంలో పేరుపెట్టి పిలిచిన మొట్టమొదటి తుపానుగా 'ఓనిల్' నిలిచింది.

బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్​, భారత్​, మాల్దీవులు, మయన్మార్​, ఒమన్​, పాకిస్థాన్​, శ్రీలంక, థాయ్​లాండ్​లు కొన్ని తుపానుల పేర్లను ప్రతిపాదించాయి. ఇప్పటికే ఈ దేశాలు ప్రతిపాదించిన మొత్తం 64 పేర్లలో 57 పేర్లను వినియోగించారు.ఫొని పేరును బంగ్లాదేశ్​ ప్రతిపాదించింది.

'పెథాయ్'​ పేరును థాయ్​లాండ్​ దేశం ప్రతిపాదించింది. గతేడాది విరుచుకుపడిన ఈ తుపాను బంగాళాఖాతంలో పుట్టి ఆంధ్రప్రదేశ్​ రాష్టాన్ని వణికించింది. భవిష్యత్తులో సంభవించే తుపానుకు 'వాయు' అనే పేరు పెట్టాలని భారత్​ సూచించింది.

భారత్​ ప్రతిపాదించిన పేర్లు

అగ్ని, జాలి, బిజ్లీ, ఆకాశ్​ పేర్లను భారత్​ ప్రతిపాదించింది. శ్రీలంక, బంగ్లాదేశ్​. పాకిస్థాన్​, దేశాలు మాలా, హెలెన్​, నీలోఫర్​ పేర్లను ప్రతిపాదించాయి. అట్లాంటిక్​, తూర్పు పసిఫిక్​ ప్రాంతాల మాదిరిగా ఈ పేర్లను పునరావృతం చేయరు.

తుపానుకు పెట్టే పేరు చిన్నగా, అందరికీ తొందరగా అర్ధమయ్యేలా ఉండాలి. ఎవరి మతాచారాలను ప్రతిబింబించేలా ఉండకూడదు.

ఇదీ చూడండి : వెనెజువెలాలో తారస్థాయికి నిరసన సెగలు

ABOUT THE AUTHOR

...view details