దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. జులైలో గడిచిన 12 రోజుల్లో రోజు వారీ కేసుల్లో వైరస్ బారిన పడిన వారి కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపింది.
జులై 1-12 తేదీల మధ్య దిల్లీలో 25,134 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే.. 31,640 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీలు.. ఆరు రోజుల్లో 2వేలకుపైగా ఉండగా మూడు రోజుల పాటు 3వేల మందికిపైగా వైరస్ బారి నుంచి బయటపడ్డారు. జులై 9న అత్యధికంగా 4 వేలకుపైగా రికవరీలు నమోదయ్యాయి.
రాజధానిలో జులై 12 నాటికి మొత్తం కేసులు 1,12,494కు చేరగా.. 89,968 మంది కోలుకున్నారు.
వివిధ తేదీల్లో కోలుకున్నవారి సంఖ్య
తేదీ | కోలుకున్నవారి సంఖ్య |
జులై 1 | 1,644 |
జులై 2 | 3,015 |
జులై 3 | 2,617 |
జులై 4 | 2,632 |
జులై 6 | 749 |
జులై 7 | 2,129 |