తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సంస్కరణలు ఇంకా చాలా ఉన్నాయ్​- చర్చలకు రండి' - Agriculture laws

వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలు ఇంకా చాలా ఉన్నాయన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు త్వరలోనే కేంద్రంతో మరోసారి చర్చించడానికి ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

More farm reforms due; hopeful of protesting unions resuming dialogue with Govt: Tomar
'సంస్కరణలు చాలా ఉన్నాయ్​- చర్చలకు రండి'

By

Published : Dec 23, 2020, 8:17 PM IST

వ్యవసాయ రంగంలో చేయాల్సిన సంస్కరణలు ఇంకా ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ అన్నారు. అందుకే ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు.. కేంద్రంతో చర్చలు జరపడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు తోమర్​. ఎలాంటి సమస్య అయిన చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందన్నారు. చరిత్రలో ఇలాంటివి ఎన్నో జరిగాయన్న ఆయన.. కేంద్రంతో మరోసారి చర్చించడానికి కర్షక సంఘాలు తేదీని ఖరారు చేయాలని కోరారు.

"రైతు సంఘాలు చర్చించుకుని తేదీ, సమయాన్ని నిర్ణయిస్తే మరోసారి చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు" అని ఆశాభావం వ్యక్తం చేశారు తోమర్​.

మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు.. మరోమారు చర్చలకు కేంద్ర ప్రతిపాదనపై తమ నిర్ణయాన్ని తెలపలేదు. ఇప్పటికే ఐదుసార్లు రైతులతో కేంద్రం చర్చలు జరపినా.. ఓ కొలిక్కి రాలేదు.

ఇదీ చూడండి:దక్షిణేశ్వర్​ మెట్రో రైలు తొలి ట్రయల్​ రన్ విజయవంతం

ABOUT THE AUTHOR

...view details