ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారుఆమ్ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్. సీనియర్ నాయకులైన ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం పెట్టి అవమానించారని ట్వీట్ చేశారు.
సీనియర్లను మోదీ అవమానించారు : కేజ్రివాల్ - ఎల్ కే అడ్వాణీ
సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలను ప్రధాని నరేంద్రమోదీ అవమానించారని దిల్లీ సీఎం కేజ్రివాల్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో అగ్రనేతలకు టికెట్ నిరాకరించడం దారుణమని దుయ్యబట్టారు.
మోదీ సీనియర్లను దారుణంగా అవమానించాడు:కేజ్రీవాల్
పెద్దలను గౌరవించాలని చెప్పే హిందూ సంప్రదాయాలకు మోదీ వ్యతిరేకమని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు కేజ్రివాల్. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను మోదీ ఎందుకు అవమానిస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు.
"ఇంటిని నిర్మించిన పెద్దలను తోసేశారు. వారినే గౌరవించని మోదీ ఇంక ఎవరిని కాపాడుతారు?- ట్విట్టర్లో అరవింద్ కేజ్రివాల్.