ఎన్నికల వేళ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ సభ్యుల వ్యాఖ్యలను విమర్శనాస్త్రంగా వాడుకుంటోంది కాంగ్రెస్.
మోదీ మరోసారి గెలిస్తే మళ్లీ ఎన్నికలు ఉండకపోవచ్చని ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా నేత సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఆసరాగా చేసుకుని భాజపాపై ధ్వజమెత్తారు రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆశోక్ గహ్లోత్. మోదీ మళ్లీ ప్రధాని అయితే.... రష్యా, చైనా లాంటి విధానం తీసుకొస్తారని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో అన్నారు.
"మోదీ హయాంలో ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో పడ్డాయి. అధికారం కోసం మోదీ ఎలాంటి పనైనా చేస్తారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి పాకిస్థాన్‌తో యుద్ధం చేయటానికీ మోదీ వెనకాడరని ప్రజలు అనుకుంటున్నారు."
--అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి