తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ రేపటికి వాయిదా

Monsoon session of Parliament to begin today
కరోనా జాగ్రత్తల నడుమ పార్లమెంట్​ సమావేశాలు

By

Published : Sep 14, 2020, 8:20 AM IST

Updated : Sep 14, 2020, 7:15 PM IST

19:13 September 14

రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. మంగళవారం ఉదయం 9గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుంది.

17:29 September 14

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​గా ఎన్నికైన హరివంశ్​ నారాయణ్​ సింగ్​కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు.

17:23 September 14

  • రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ సింగ్‌
  • రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన జేడీయూ సభ్యుడు హరివంశ్‌ సింగ్‌
  • హరివంశ్‌ సింగ్‌ను ప్రతిపాదించిన జె.పి.నడ్డా, సమర్థించిన థావర్‌చంద్‌
  • విపక్షాల తరఫున పోటీ చేసిన ఆర్‌జేడీ సభ్యుడు మనోజ్ ఝా

16:51 September 14

గంటపాటు వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. కరోనా కారణంగా జీవన విధానంలో ఊహించని మార్పులు వచ్చాయని ఛైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం ఇంకొంత కాలం కొనసాగించక తప్పదని చెప్పారు.

15:38 September 14

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ సహా ఇటీవల మరణించిన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులకు రాజ్యసభ సంతాపం తెలిపింది.

15:26 September 14

కరోనా నేపథ్యంలో సభలో భౌతిక దూరం పాటించేందుకు విజిటర్స్​ గ్యాలరీలో కూర్చున్నారు రాజ్యసభ ఎంపీలు.

15:15 September 14

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ తొలిరోజు సమావేశమైంది. ఇటీవల ఎన్నికైన పలువురు రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

13:29 September 14

లోక్​సభ వాయిదా..

తొలిరోజు లోక్​సభను మధ్యాహ్నాం వరకు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా​. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. 

12:05 September 14

కరోనా కట్టడి విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థితిలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంతోనే ఇది సాధ్యమైందన్నారు.

11:10 September 14

శూన్యగంట..

లోక్​సభలో శూన్యగంట కొనసాగుతోంది. సమస్యను వివరించేందుకు ఒక్కో సభ్యునికి నిమిషం పాటు అవకాశం ఇచ్చారు స్పీకర్ ఓం బిర్లా.

10:35 September 14

ప్రశ్నోత్తరాల రద్దుపై చర్చ..

కరోనా నేపథ్యంలో లోక్​సభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీనిపై మరోసారి ఆలోచించాలని కోరారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని 'గోల్డెన్​ అవర్'​గా అభివర్ణించారు కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి.

విపక్షాల ఆందోళనపై పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు.

"ఇది అసాధారణ పరిస్థితి. సమావేశాలు జరపలేని పరిస్థితి. అయినా 800-850 మంది ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోదు. చర్చకు సిద్ధంగా ఉన్నాం"అని స్పష్టంచేశారు జోషి. 

10:25 September 14

తొలిసారి..

  • చరిత్రలో తొలిసారి ఈ విధంగా సమావేశాలు జరుగుతున్నాయి: స్పీకర్‌
  • లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు 2 సభల్లో కూర్చోవడం ఇదే తొలిసారి: స్పీకర్
  • సభ్యులంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: స్పీకర్‌
  • అసాధారణ పరిస్థితుల్లో జరిగే ఈ సమావేశాలకు అందరూ సహకరించాలి: స్పీకర్‌
  • చట్టసభలు 130 కోట్ల ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక కావాలి: స్పీకర్‌
  • మనదేశం త్వరగా కరోనా నుంచి కోలుకోవాలి: స్పీకర్‌
  • విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న కరోనా యోధులకు అభినందనలు: స్పీకర్‌
  • దేశ ప్రజలకు హిందీ దివస్‌ శుభాకాంక్షలు: స్పీకర్‌

09:24 September 14

గంట పాటు వాయిదా...

  • లోక్‌సభ గంటసేపు వాయిదా
  • ప్రణబ్ సహా పలువురు సభ్యులు, ప్రముఖుల మృతికి లోక్‌సభ సంతాపం

09:22 September 14

  • లోక్‌సభలో వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు
  • తూర్పు లద్దాఖ్‌లో చైనా దురాక్రమణపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం
  • దిల్లీ పోలీసుల మానవ హక్కుల ఉల్లంఘనపై సీపీఎం, ఐయూఎంఎల్‌ వాయిదా తీర్మానం
  • దిల్లీ అల్లర్ల సందర్భంగా పోలీసుల మానవహక్కుల ఉల్లంఘనపై వాయిదా తీర్మానం
  • నీట్‌ సందర్భంగా 12 మంది విద్యార్థుల ఆత్మహత్య ఘటనలపై వాయిదా తీర్మానం
  • విద్యార్థుల ఆత్మహత్యలపై డీఎంకే, సీపీఎం వాయిదా తీర్మానం
  • దిల్లీ అల్లర్ల ఘటనలపై ఛార్జిషీట్‌లో నాయకులను చేర్చడంపై వాయిదా తీర్మానం
  • పోలీసుల ఛార్జిషీట్‌లో నాయకులను చేర్చడంపై ఆర్‌ఎస్పీ వాయిదా తీర్మానం

09:09 September 14

  • దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం
  • ఇటీవల మరణించిన ప్రముఖులకు లోక్‌సభ సంతాపం
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లోక్‌సభ సంతాపం

08:57 September 14

"ఈసారి పార్లమెంటు సమావేశాలు విభిన్నంగా జరుగుతున్నాయి. విపత్కర పరిస్థితుల్లోనూ సభ్యులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సభ్యులకు అభినందనలు. మొదటిసారిగా లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరు సమయాల్లో కొలువుదీరుతున్నాయి. ఈసారి శని, ఆదివారాల్లోనూ సభ సమావేశమవుతుంది. సైన్యం వెంట యావత్​ దేశం తోడుగా ఉందనే గట్టి సందేశాన్ని ఈ సందర్భంగా పార్లమెంట్​ సభ్యులందరూ ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను." 

   - నరేంద్ర మోదీ, ప్రధాని.

08:45 September 14

మోదీ రాక...

పార్లమెంట్​ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్​కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సమావేశాలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.

08:42 September 14

  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సిట్టింగ్ సభ్యుడు వసంత్ కుమార్ సహా ఇటీవల మరణించిన పలువురు ప్రముఖులకు సంతాపం తెలుపనున్న లోకసభా.
  • ఈ సమావేశాల్లో చేపట్టిన పలు మార్పులపై తీర్మానం ప్రవేశ పెట్టనున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.
  • సభా సమయం కుదింపు, ప్రశ్న కాలాన్ని రద్దు చేయడం, సూన్య గంట సమయం కుదింపు వంటి అంశాలతో తీర్మానం ప్రవేశపెట్టనున్న జోషి
  • కరోనా మహమ్మారి ప్రభావం, ప్రస్తుత పరిస్థితి పై సభలో ఒక ప్రకటన చేయనున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్

08:37 September 14

పార్లమెంట్​ ఆవరణలో శానిటైజేషన్​

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్నాయి.  ఈ నేపథ్యంలో పార్లమెంట్​ ఆవరణ మొత్తం శానిటైజ్ చేశారు అధికారులు. 

08:26 September 14

నీట్​ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా డీఎంకే నిరసన

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ నీట్​ పరీక్షలు నిర్వహించటాన్ని వ్యతిరేకిస్తూ.. పార్లమెంట్​ ఆవరణలో డీఎంకే నిరసన చేపట్టింది. ఇవాళ పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీలు టీఆర్​ బాలు, కనిమొళి పార్లమెంట్​ ఎదుట నిరసన చేశారు.

07:41 September 14

రాజ్యసభ రేపటికి వాయిదా

కాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనా వేళ నిర్వహిస్తున్న తొలి పార్లమెంట్​ సమావేశాలు ఇవే కావడం వల్ల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాలు.. ఈ ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించి ట్రయల్​ రన్​లను కూడా నిర్వహించారు.

ఉదయం రాజ్యసభ...

సాధారణ పరిస్థితుల్లో లోక్​సభ, రాజ్యసభలు ఏకకాలంలో జరుగుతూ ఉండేవి. కరోనా నేపథ్యంలో ఉభయ సభల సమయాల్లోనూ మార్పులు చేశారు. తొలి రోజు ఉదయం లోక్​సభ, మధ్యాహ్నం రాజ్యసభ జరగనుంది. ఆ తర్వాత నుంచి ఉదయం 11గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 2గంటలకు లోక్​సభ సమావేశమవుతుంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేశారు.

ఈ నేపథ్యంలో ఈసారి ఉభయసభల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. కరోనా సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతల వంటి అస్త్రాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కూడా సిద్ధమయ్యాయి.

ఏర్పాట్లు ఇలా...

భౌతిక దూరం నియమాన్ని పక్కగా పాటించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సభ్యులు కూర్చునేందుకు ఛాంబర్లు, గ్యాలరీలను ఉపయోగించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మాట్లాడే సభ్యులను చూపించేందుకు నాలుగు పెద్ద స్క్రీన్లను ఛాంబర్లలో పెట్టారు. మరో ఆరు చిన్న స్క్రీన్లు, ఆడియో సెట్లను నాలుగు గ్యాలరీల్లో ఉంచారు.

పత్రాల వినియోగాన్ని కూడా పరిమితం చేశారు అధికారులు. ఎలక్ట్రానిక్​ పరికరాల ద్వారా బిల్లులు, ఆర్డినెన్సులు తదితర పేపర్లను పంపిణీ చేయనున్నారు. సభ్యులు సొంతంగా ఈ-రీడర్​ పరికరాలను తెచ్చుకునేందుకు కూడా అనుమతినిచ్చారు.

నెగెటివ్​ వస్తేనే...

మరోవైపు సభలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 72 గంటల ముందుగానే ఈ పరీక్షలు జరగాలని... అందులో నెగెటివ్​ వచ్చిన వారికే సమవేశాలకు అనుమతి ఉంటుందని తేల్చిచెప్పారు. వీటితో పాటు పార్లమెంట్​ సభ్యుల వ్యక్తిగత సిబ్బంది, ఇంట్లో పనిచేసే వారు కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

వారిపై ఆంక్షలు...

కరోనా ప్రభావం నేపథ్యంలో పార్లమెంట్​ ఆవరణలోకి ప్రవేశంపైనా ఆంక్షలు విధించారు అధికారులు. ఎంపీల పీఏలు, పీఎస్​లకు ప్రవేశాన్ని నిషేధించారు. మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి కూడా నామమాత్రంగానే అనుమతినిచ్చారు. సభా కార్యకలాపాల్లో భాగమైన అధికారులు మినహా ఎవరికి అనుమతినివ్వలేదు. ఎంపిక చేసిన మీడియా సంస్థల ప్రతినిధులు మాత్రమే పార్లమెంటు ఆవరణలో సమావేశాల కవరేజి చేయవచ్చని స్పష్టం చేశారు.

Last Updated : Sep 14, 2020, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details