పశ్చిమ రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. సాధారణ రోజుల కంటే 11 రోజుల ఆలస్యంగా తిరోగమనం చెందాయని తెలిపింది. మరో రెండు రోజుల్లో హరియాణా, ఛత్తీస్గఢ్, దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వెనుదిరగనున్నట్లు పేర్కొంది.
''ఈ రోజు నుంచి పశ్చిమ రాజస్థాన్, పంజాబ్ పరిసర ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లాయి. రానున్న ఐదు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడనుంది.''