తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ రెండు నెలల్లో సాధారణ వర్షపాతమే' - Monsoon likely to be normal in second half of\ rainfall season: IMD

ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అంచనా వేసింది భారత వాతావరణ విభాగం. శుక్రవారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు పెద్దగా వర్షాలు లేకపోవడం వల్ల రైతులు నైరుతి రుతుపవనాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.

Monsoon likely to be normal in second half of rainfall season: IMD
'ఆ రెండు నెలలు వర్షపాతం సాధారణమే'

By

Published : Jul 31, 2020, 6:22 PM IST

కరోనా సంక్షోభంతో రైతన్న ఇబ్బందులు పడుతుంటే.. అతడి ఆశలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది జూన్​, జులైలో పెద్దగా వర్షపాతం లేకపోవడం వల్ల ఆగస్టుపైనే ఆశలు పెట్టుకున్నారు అన్నదాతలు. అయితే నాలుగు నెలల వర్షాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్​లో వర్షాలు సాధారణంగానే కురవచ్చని తెలిపింది భారత వాతావరణ శాఖ. 2020 నైరుతి రుతుపవనాలు ఆశించిన మేర ప్రభావం చూపకపోవచ్చని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ఈశాన్య భారతంలోనే ప్రస్తుతం భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైరుతిపై ఆధారపడిన మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఈసారి తక్కువ వర్షపాతమే నమోదు కానుందని.. ఆగస్టులో 97 శాతం సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు అధికారులు.

"సాధారణంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాకాలం రెండో భాగంలో చూసుకుంటే వర్షపాతం తక్కువగా ఉండనుంది. 104 శాతం వర్షపాతం నమోదవ్వచ్చు. అందులో 8 శాతం హెచ్చుతగ్గులు ఉండొచ్చు."

- భారత వాతావరణ విభాగం

1961-2010 కాలంలో చూసుకుంటే దేశవ్యాప్తంగా కురిసిన వర్షాన్ని లాంగ్​ పీరియడ్​ యావరేజ్(ఎల్​పీఏ)​గా లెక్కగట్టారు. అందులో 88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 96-104 శాతం ఉంటే ఎల్​పీఏ సాధారణంగా గణిస్తారు. ప్రస్తుతం నైరుతి కాలంలో ఇదే స్థాయిలో వర్షాలు కురవనున్నాయి. దేశంలో జూన్​ 1 నుంచి సెప్టెంబర్​ 30 వరకు వర్షాకాలంగా ప్రభుత్వం గుర్తిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details