నైరుతి రుతుపవనాలు వచ్చినా లోటు వర్షపాతమే దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ ఇంకా లోటు వర్షపాతమే కనిపిస్తోందని భారత వాతావరణ విభాగం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముప్పావు శాతం ఉపవాతావరణ విభాగాల పరిధిలో ఈ వర్షపాతం లోటు ఉంది. అయితే దేశం మొత్తం మీద వర్షపాతం లోటు 33 నుంచి 21 శాతానికి తగ్గిందని వాతావరణ విభాగం తెలిపింది.
దేశంలోని 91 ప్రధాన జలాశయాల్లో 62 చోట్ల 80 శాతం లేదా అంతకంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు కేంద్ర జల సంఘం వివరించింది.
'ఐఎమ్‌డీ'కి నాలుగు విభాగాలు ఉన్నాయి. వీటిని 36 ఉపవిభాగాలుగా విభజించారు. వీటిలో 24 ఉపవిభాగాల్లో వర్షపాతం లోటు ఉంది. దక్షిణ భాగం(30 శాతం)తో పోల్చి చూస్తే తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో వర్షపాతం లోటు (36 శాతం) అధికంగా ఉన్నట్లు ఐఎమ్‌డీ స్పష్టం చేసింది. మధ్య భారతదేశంలో మాత్రం గత వారం రోజుల్లో వర్షపాతం బాగా నమోదైందని వెల్లడించింది.
ఇదీ చూడండి: జలశక్తి: స్థానిక సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు