తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రుతుపవనాల రికార్డ్- రెండు వారాల ముందే... - indian rainy season

ఈ సారి రెండు వారాల ముందుగానే.. రుతుపవనాలు దేశమంతా విస్తరించాయంటోంది భారత వాతావరణ శాఖ. 2013 తర్వాత రుతుపవనాలు ఇంత వేగంగా దేశమంతా చుట్టేయడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. తుపాను కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది.

Monsoon covers entire country nearly two weeks early: IMD
రెండు వారాల ముందుగానే దేశాన్ని చుట్టేసిన రుతుపవనాలు!

By

Published : Jun 26, 2020, 4:01 PM IST

నైరుతి రుతుపనాలు.. రెండు వారాల ముందుగానే దేశమంతా విస్తరించాయని వెల్లడించింది భారత వాతావరణ శాఖ.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది రుతుపవనాలు జూన్​ 1న కేరళలో ప్రారంభమయి, రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​కు చేరేందుకు దాదాపు 45 రోజులు పడుతుంది. అంటే దేశమంతా జులై 8 వరకల్లా వర్షాలు కురుస్తాయనుకుంది. కానీ, అనుకున్నదానికంటే వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.

"జూన్​ 26 వరకల్లా పంజాబ్​, హరియాణా, రాజస్థాన్​లోని కొన్ని ప్రాంతాలు మినహా... యావత్​దేశంలో వర్షపాతం నమోదైంది. 2013 తర్వాత నైరుతి రుతుపవనాలు ఇంత వేగంగా విస్తరించడం ఇదే తొలిసారి. "

-వాతావరణ శాఖ

బంగాళాఖాతం మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా అల్పపీడనం ఏర్పడింది. భారత్​లో తుపాను సూచికల వల్లే రుతుపవనాలు వేగంగా దేశమంతా విస్తరించాయని వాతవరణ శాఖ తెలిపింది.

ఉత్తరాఖండ్ వరదల తర్వాత రుతుపవనాలు 2013లో జూన్ 16 తేదీ లోపు దేశమంతా విస్తరించాయి.

ఇదీ చదవండి : ఆ మాస్టారు చెప్పే 'లౌడ్​ స్పీకర్​ క్లాసు'లకు పిల్లలు ఫిదా

ABOUT THE AUTHOR

...view details