ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే మధ్య భారత్, దక్షిణ ద్వీపకల్పంలో సాధారణ వర్షపాతం కురుస్తుందని వెల్లడించింది.
'ఉత్తర భారతంలో ఈ ఏడాది వర్షాల జోరు.. కానీ' - ఉత్తర భారతదేశం
ఉత్తర భారతదేశంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఈశాన్య భారత్లో తక్కువగా నమోదవుతుందని పేర్కొంది.
ఉత్తర భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
తూర్పు, ఈశాన్య భారత్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించినట్లు తెలిపిన ఐఎండీ.. జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 75 శాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుందని పేర్కొంది.
ఇదీ చూడండి:'వ్యాక్సిన్ వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు'