రఫేల్ అంశంపై కేంద్రంపై మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రఫేల్ కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపించారు. డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి ఈ జెట్ల కొనుగోలు విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ట్వీట్ చేశారు.
ఓ వార్తా పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ.. దేశ ఖజానా దోపిడీకి గురైందంటూ ఆరోపించారు రాహుల్. 'సత్యం ఒక్కటే, కానీ మార్గాలు ఎన్నో' అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని తన ట్వీట్లో ప్రస్తావించారు.