తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోంజి స్కాం: మహమ్మద్​ మన్సూర్​ ఖాన్​ అరెస్ట్​ - BENGALURU

పోంజి కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఐఎంఏ జువెల్స్​ సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్​ మన్సూర్​ ఖాన్​ అరెస్ట్​ అయ్యాడు. దుబాయ్​ నుంచి భారత్​కు వచ్చిన మన్సూర్​ను దిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు ఈడీ​ అధికారులు. విచారించేందుకు ఈడీ కార్యాలయానికి తరలించారు.

పోంజి స్కాం: మహమ్మద్​ మన్సూర్​ ఖాన్​ అరెస్ట్​

By

Published : Jul 19, 2019, 11:14 AM IST

అధిక వడ్డీలను ఎరచూపి ప్రజల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు సేకరించిన కేసులో ఐఎంఏ జువెల్స్​ సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ మన్సూర్ ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సిట్ అధికారుల సంయుక్త బృందం అరెస్ట్ చేసింది. దుబాయ్‌ నుంచిశుక్రవారం భారత్‌కు వచ్చిన మన్సూర్‌ ఖాన్‌ను దిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తరలించారు.

భారత్‌కు తిరిగి వచ్చి చట్టం ముందు లొంగిపోవాలంటూ దుబాయ్‌లోని తమ అధికారులు ఒత్తిడి చేయడం వల్లే.. మన్సూర్‌ భారత్​కు తిరిగివచ్చినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించనున్నట్లు వెల్లడించారు.

4,084 కోట్ల పెట్టుబడులు

ఐఎంఏ పేరిట సుమారు లక్ష మంది డిపాజిటర్ల నుంచి నాలుగువేల 84 కోట్ల పెట్టుబడులను మన్సూర్ సమీకరించాడు. వారికి వడ్డీలు చెల్లించకపోవటం వల్ల డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే దుబాయ్‌కు మకాం మార్చేశాడు మన్సూర్​ ఖాన్​.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌కు 400 కోట్లు ఇచ్చానని మన్సూర్ గతంలో వెల్లడించాడు. ఈ కేసు విషయమై ఇటీవలే సిట్‌ అధికారులు రోషన్‌బేగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

22 మంది అరెస్ట్​..

వేల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు కేసుకు సంబంధం ఉన్న 12 మంది సంస్థ డైరెక్టర్లతో సహా 22 మందిని అదుపులోకి తీసుకుంది.

ఇదీ చూడండి: రోషన్​బేగ్​పై ప్రశ్నల వర్షం... విడుదల

ABOUT THE AUTHOR

...view details