తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పు అనంతర పరిణామాలపై ఆర్​ఎస్​ఎస్​ వ్యూహాలు! - rss latest news

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన అనంతర పరిణామాలపై ఏ విధంగా స్పందించాలనే అంశంపై ఆర్​ఎస్​ఎస్​ వ్యూహాలు రచిస్తోంది. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పేర్కొంటూ.. సంఘ్​ ఉన్నత స్థాయి నాయకత్వం దేశవ్యాప్తంగా పర్యటనలు చేపట్టేలా ప్రణాళికలు చేస్తోంది. తీర్పు అనంతరం ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​ లేదా సురేశ్​ భయ్యాజీ జోషీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అయోధ్య తీర్పు పరిణామాలపై ఆర్​ఎస్​ఎస్​ వ్యూహాలు!

By

Published : Nov 8, 2019, 5:06 AM IST

Updated : Nov 8, 2019, 7:30 AM IST

అయోధ్య తీర్పు అనంతర పరిణామాలపై ఆర్​ఎస్​ఎస్​ వ్యూహాలు!

అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ఈనెల 17లోపు తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా తీర్పు అనంతర పరిణామాలు, ఏ విధంగా స్పందించాలనే అంశంపై రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) వ్యూహాలు రచిస్తోంది. ఆర్​ఎస్​ఎస్​కు చెందిన ఉన్నత స్థాయి నాయకత్వం దేశవ్యాప్తంగా పర్యటించి.. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంగా ఉండాలని ప్రచారం కల్పించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఉన్నత స్థాయి నాయకులు దేశవ్యాప్తంగా ఎవరెక్కడ పర్యటించాలనే దానిపైనా ఇప్పటికే చర్యలు చేపట్టింది సంఘ్​.

" అయోధ్య తీర్పు ఆధారంగా ఆర్​ఎస్​ఎస్​ సర్సంఘ్​చాలక్​ మోహన్​ భగవత్​ లేదా భయ్యాజీ జోషీ మీడియా ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. తీర్పు ఏ విధంగా వచ్చినా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు సంఘ్​ నేతలు. అల్లర్లు జరిగే ప్రాంతాలపైనా దృష్టి సారించారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తే.. ఇంట్లోనో లేక సమీప ఆలయాల్లో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని తన స్వయంసేవక్​లకు ఇప్పటికే సూచించింది సంఘ్​. అదే విధంగా తీర్పు వ్యతిరేకంగా వస్తే.. శాంతియుతంగా ఉండాలని పేర్కొంది."

-ఆర్​ఎస్​ఎస్​ సీనియర్​ నేత

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా సంఘ్​, భాజపా ఉన్నతస్థాయి నాయకత్వం హాజరైన సమావేశంలో రామ జన్మభూమి తీర్పు అనంతర పరిణామాలపై చర్చించినట్లు సంఘ్ వర్గాలు తెలిపాయి.

సమన్వయ సమావేశం..

అయోధ్య భూవివాద కేసుపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. దిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్​లో ఆర్​ఎస్​ఎస్​, భాజపా గురువారం సమన్వయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆర్​ఎస్​ఎస్​ నాయకుడు క్రిష్ణ గోపాల్​, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్​ సంతోష్​, కేంద్ర మంత్రులు నరేందర్​ సింగ్​ తోమర్​, నిర్మలా సీతారామన్​, పీయూష్​ గోయల్​, గిరిరాజ్​ సింగ్​, సంతోష్​ గంగ్వార్​, పార్టీ నేతలు భూపేంద్ర యాదవ్​ హాజరయ్యారు.

ఇదీ చూడండి:'అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి'

Last Updated : Nov 8, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details