తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొదటిసారి ఓటేయనున్న గ్రామం - పంతానియా గ్రామం

ఆ గ్రామంలోని వారెవరూ ఇంతవరకు ఓటేయలేదు. మొదటిసారి ఈ లోక్​సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంకా దేశంలో ఇలాంటి గ్రామాలు ఉన్నాయా? అని ఆశ్చర్యం కలుగుతోంది కదా! ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​కు ఇలాఖా గోరఖ్​పూర్​లోని ఒక మారుమూల గ్రామం కథ ఇది.

మొదటిసారి ఓటేయనున్న గ్రామం

By

Published : Mar 20, 2019, 6:13 AM IST

మొదటిసారి ఓటేయనున్న గ్రామం

గోరఖ్​పూర్​...! రాజకీయంగా ప్రముఖంగా వినిపించే పేరు. కారణం... ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సొంత ఇలాఖా కావడం. కానీ ఇదే ప్రాంతంలోని ఓ గ్రామ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఓటు హక్కు కల్పించలేదు. మొదటి సారి ఈ లోక్​సభ ఎన్నికల్లో వారంతా ఓటేయనున్నారు.

పంతానియా గ్రామం అటవీ ప్రాంతంలో ఉంటుంది. రోడ్లు కూడా సరిగా లేని ఈ ఊరిలో ప్రజలు వ్యవసాయం చేసుకొని జీవిస్తుంటారు.

బ్రిటిష్​ సైనికులతో పాటు మా నాన్న, వారి తండ్రి ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. అంతకుముందు వనవిభాగంలో చెట్లు కొట్టే పని చేసేవాళ్లం. నలుగురు ఐదుగురు కలిసి బృందంగా పనిచేసే వాళ్లం.
- ముఖ్లాన్​, పంతానియా గ్రామస్థుడు

ప్రస్తుత ప్రభుత్వం చొరవ వల్లే ఓటు హక్కు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

మాకు మొదటిసారి ఎన్నికల్లో ఓటేయటానికి అవకాశం వచ్చింది. మేము ఇక్కడ 40-45 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. అంతకుముందు మేము కట్టెలు కొట్టుకొని బతికేవాళ్లం. 27 ఏళ్ల నుంచి చెట్లు నరకటానికి అనుమతించలేదు. అడవిలో ఉంటున్న మాకు మరో పని చేయటానికి అవకాశం లేదు. ఇటీవలే మాకు ఇళ్లు వచ్చాయి. దీనిపై మేము సంతోషంగా ఉన్నాం.
- విజయ్,​ పంతానియా గ్రామస్థుడు

ABOUT THE AUTHOR

...view details