కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధానిని విమర్శించడానికి 'మోదీలై' అనే కొత్త పదాన్ని సృష్టించారు. 'మోదీ లైస్' అనే వెబ్సైట్ ఉందని, అది మోదీ చెప్పే అబద్ధాలను కళ్లకు కడుతుందని రాహుల్ అన్నారు. 'మోదీ లైస్' వెబ్సైట్ లింక్‌నూ ఆయన ట్వీట్ చేశారు.
'మోదీ లై' అనే పదం డిక్షనరీలోనూ చేరిందని ఫొటోషాప్ చేసిన ఆంగ్ల నిఘంటువు స్క్రీన్‌షాట్‌ను ట్వీట్‌కు జత చేశారు. ఈ పదానికి అర్థం 'సత్యాలను వక్రీకరించే వ్యక్తి' అని వివరించారు. నిఘంటువులో ఆ పదానికి మూడు రకాల అర్థాలు ఉన్నట్లుగా ఆ స్క్రీన్‌షాట్‌లో చూపించారు.