తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీజీ... పాక్​ చెర నుంచి రక్షించండి: సింధి సంఘాలు - SINDHI

సింధి, బలూచ్​, పస్టో సంఘాల ప్రతినిధులు అమెరికాలో హౌడీ-మోదీ వేదిక వద్ద ప్రదర్శన చేపట్టారు. పాకిస్థాన్​ చెర నుంచి తమను కాపాడాలని భారత్​- అమెరికా దేశాధినేతలను కోరారు

మోదీజీ... పాక్​ చెర నుంచి రక్షించండి: సింధి సంఘాలు

By

Published : Sep 22, 2019, 10:34 AM IST

Updated : Oct 1, 2019, 1:30 PM IST

పాకిస్థాన్​ అరాచకాల నుంచి రక్షించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను కోరాయి సింధి, బలూచ్, పస్టో సంఘాలు. మోదీ, ట్రంప్​ పాల్గొనే 'హౌడీ మోదీ' సభా వేదిక వద్ద ఆయా సంఘాల ప్రతినిధులు ప్రదర్శన చేపట్టారు.

అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి హ్యూస్టర్​ చేరుకున్న వీరంతా... పాకిస్థాన్​ నుంచి స్వేచ్ఛ కల్పించాలని నినాదాలు చేశారు. బలూచ్​ ప్రాంతంలో పాకిస్థాన్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.

మోదీజీ... పాక్​ చెర నుంచి రక్షించండి: సింధి సంఘాలు

1971లో బంగ్లాదేశ్​ ప్రజల స్వేచ్ఛకు భారత్​ సహాయం చేసినట్లు పాక్ ప్రజలకు సహాయం చేయాలని కోరుతున్నాను. పాకిస్థాన్​లో ఉగ్రవాదం పెరిగిపోయింది. అంతా ఐఎస్​ఐ, సైన్యం చెప్పినట్టే సాగుతోంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే స్వేచ్ఛ కోరుకుంటున్నారు.
-జాఫర్ సాహిటో, సింధి హక్కుల ఉద్యమకారుడు

ఇదీ చూడండి:చమురు సంస్థల ప్రతినిధులతో మోదీ సమావేశం

Last Updated : Oct 1, 2019, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details