తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమో 2.0: మోదీ మార్క్​ దౌత్య విధానం

ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలకు విదేశీ అతిథులను ఆహ్వానించటం మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో భాగంగా మారింది.

మోదీ

By

Published : May 30, 2019, 7:24 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా సాగింది. 'బే ఆఫ్ బంగాల్ ఇనీషియేటివ్​ ఫర్​ మల్టీ సెక్టోరల్ టెక్నికల్​ అండ్​ ఎకనామిక్​ కోఆపరేషన్'​-బిమ్​స్టెక్ దేశాల అధినేతలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బిమ్​స్టెక్​ కూటమిలో బంగ్లాదేశ్, భారత్​, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్​ భాగస్వాములు.

మోదీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన దేశాధినేతలు

  • శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
  • నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి
  • మయన్మార్​ అధ్యక్షుడు యూవిన్​ మైయింట్​
  • భూటాన్ ప్రధాని లొటాయ్ షెరింగ్
  • థాయిలాండ్​ విదేశాంగ ప్రతినిధి గ్రిసాడా బూన్రాక్​
  • బంగ్లాదేశ్​ కేంద్ర మంత్రి ఏకేఎం మొజామ్మల్​ హక్
  • మారిషస్​ ప్రధాని ప్రవింద్​ కుమార్​ జగనాథ్​
  • కిరిగిస్థాన్​ అధ్యక్షుడు సూరోన్​బే జీన్​బెకొవ్​

భారత్​లో ఇలాంటి విశిష్ట కార్యక్రమాలకు ఇతర దేశాల అధినేతలు హాజరవడం కొత్తేమీ కాదు. 2014లో మోదీ పదవిని స్వీకరించేటప్పుడు సార్క్​ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో పాకిస్థాన్​ అప్పటి ప్రధాని నవాజ్​ షరీఫ్​ కూడా ఉన్నారు.

భారత్​లో పర్యటించిన దేశాల అధినేతలు

2014లో మోదీ అధికారంలోకి రాగానే విదేశీ పర్యటనలపై దృష్టి సారించారు. అదే తీరులో భారత్​కు విదేశీ నేతలు క్యూ కట్టారు. ప్రపంచంలోని అనేకమంది రాజకీయ ప్రముఖులు... భారత దేశ అతిథి మర్యాదలు స్వీకరించారు.

2014

సెప్టెంబర్​లో ఆస్ట్రేలియా ప్రధాని టోని అబాట్​ భారత్​ వచ్చారు. యురేనియం ఎగుమతుల ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని టోని అబాట్​

అదే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ పర్యటించారు. గుజరాత్​లో పెట్టుబడులకు 3 ఒప్పందాలు చేసుకున్నారు.

జిన్​పింగ్​తో..

డిసెంబర్​లో వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​... రక్షణ సామగ్రి కొనుగోళ్లకు ఒడంబడిక కుదుర్చుకున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్​తో..

2015

జనవరిలో గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్​ ఒబామా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఒబామాతో మోదీ

ఆ ఏడాదిలోనే అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ, జర్మనీ ఛాన్స్​లర్​ ఎంజెలా మెర్కెల్​, జపాన్​ ప్రధాని షింజో అబే పర్యటించారు.

ఎంజెలా మెర్కెల్​

2016

గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అప్పటి​ అధ్యక్షుడు ఫ్రాంకాయిస్​​ హోలాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఫ్గాన్​ అధ్యక్షుడు ఘని మరోసారి దేశానికి వచ్చారు.

ఫ్రాంకాయిస్​ హోలండేతో...

అక్టోబర్​లో జరిగిన 8వ బ్రిక్స్​ సదస్సుకు భాగస్వామ్య దేశాలు దక్షిణాఫ్రికా, చైనా, రష్యా, బ్రెజిల్​ అధ్యక్షులు హాజరయ్యారు. నవంబర్​లో యూకే ప్రధాని థెరిసా మే వచ్చారు.

బ్రిక్స్​ నేతలతో...
థెరిసా మే

2017

గణతంత్ర​ వేడుకలకు అబుదబి రాకుమారుడు మహమ్మద్ బిన్ జాయేద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేర్వేరు రంగాల్లో సహకారం పెంపే లక్ష్యంగా ఏప్రిల్​లో ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్​ టర్నబుల్​ దేశంలో పర్యటించారు. సెప్టెంబర్​లో జపాని ప్రధాని రెండోసారి పర్యటించారు.

ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్​ టర్నబుల్​
మహ్మద్​ బిన్​ జాయేద్​

నవంబర్​లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కుమార్తె ఇవాంక ట్రంప్​ హైదరాబాద్​కు విచ్చేశారు. నగరంలో జరిగిన ప్రపంచ వ్యవస్థాపకత సదస్సుకు హాజరయ్యారు.

ఇవాంకా ట్రంప్​తో...

2018

69వ గణతంత్ర వేడుకలకు పది దేశాల అధినేతలకు ఆహ్వానాలు పంపింది మోదీ ప్రభుత్వం. ఆసియా ఖండంలోని బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్​, మలేషియా, మయన్మార్​, ఫిలిప్పీన్స్​, సింగపూర్​, థాయ్​లాండ్​, వియత్నాం మొత్తం పది దేశాల నుంచి దేశాధినేతలు హాజరయ్యారు. భారత గణతంత్ర వేడుకులు అమోఘమని ప్రశంసించారు.

10 దేశాల నేతలతో...

2019

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్​ రమాఫోసా మెరిశారు. ఈ ఏడాది భారత్​లో ఇతర దేశాల యువరాజులు కూడా పర్యటించారు. సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​, మొనాకో యువరాజు ఆల్బర్ట్​-2 భారత్​ను సందర్శించారు. అర్జెంటీనా అధ్యక్షుడు మాక్రికో మాక్రి వచ్చారు.

మొనాకో యువరాజుతో
మహ్మద్​ బిన్​ సల్మాన్​...

ఇదీ చూడండి: ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఆహ్వానం..

ABOUT THE AUTHOR

...view details