తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇజ్రాయెల్​ ప్రధానికి మోదీ శుభాకాంక్షలు - modi wishes to israel prime minister netanyahu and benny guntz

ఇజ్రాయెల్​లో అయిదోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన లికుద్ పార్టీ నేత బెంజిమన్ నెతన్యాహుకి.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

modi wishes to israel prime minister netanyahu and benny guntz
ఇజ్రాయెల్ నేతలకు మోదీ శుభాకాంక్షలు

By

Published : May 17, 2020, 10:09 PM IST

Updated : May 17, 2020, 10:39 PM IST

ఇజ్రాయెల్​లో అయిదోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి, లికుద్ పార్టీ నేతబెంజిమన్​ నెతన్యాహుకి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఆయనతో పాటు ఎన్నికల ప్రత్యర్థి, బెన్నీ గంట్జ్​కు విజయం చేకూరాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హిబ్రూ, ఆంగ్ల భాషల్లో ట్వీట్ చేశారు మోదీ.

కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. భారత్-ఇజ్రాయెల్​ మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.

ముగిసిన సంక్షోభం..

రాజకీయ సంక్షోభం తాండవించిన ఇజ్రాయెల్​లో ఏడాది కాలంలోనే మూడు సార్లు ప్రధాని ఎన్నికలు జరిగాయి. సరైన ఆధిక్యం రాకపోవడం వల్ల అధికారం ఏర్పాటు చేసే అవకాశం ఎవరికీ రాలేదు.

మార్చిలో విడుదలైన మూడో ఎన్నికల ఫలితాల్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుద్ పార్టీ.. 36 స్థానాలు సాధించింది. సమీప ప్రత్యర్థి బెన్నీ గంట్జ్​ సారథ్యంలోని బ్లూ అండ్​ వైట్ పార్టీ 32 స్థానాలను కైవసం చేసుకుంది. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్​లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 61 సీట్లు అవసరం.

నెతన్యాహుతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బెన్నీ తొలుత విముఖత వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది లేదని తేల్చి చెప్పారు. అయితే రెండు నెలల తర్వాత బెన్నీ మనసు మార్చుకున్నారు. నెతన్యాహుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు.

ఇప్పుడు..

ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కలిసి ప్రధానమంత్రి పీఠాన్ని పంచుకోనున్నారు. 2021 నవంబర్ 18​ వరకు నెతన్యాహు అధికార పగ్గాలు చేపట్టే విధంగా ఇప్పటికే ఒప్పందం జరిగింది. పద్దెనిమిది నెలల తర్వాత అధికార బదిలీ చేసుకోనున్నారు. అప్పటివరకు బెన్నీ గంట్జ్​ ఉప ప్రధాని, రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తారు. 2021 నవంబర్ 18​ తర్వాత నెతన్యాహు ప్రత్యామ్నాయ ప్రధానిగా ఉంటారు.

Last Updated : May 17, 2020, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details