పాతిక సీట్లలో పోటీ చేసే ప్రతి పార్టీ నేతా ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మహాకూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరో స్పష్టత లేకపోవడంపై ఈమేరకు విమర్శలు గుప్పించారు మోదీ.
బంగాల్లోని కమర్పరాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ప్రధాని. తన విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానమిచ్చారు. ఈ పర్యటనల వల్లే భారత్ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు.
'పాతిక సీట్లతోనే ప్రధాని అయిపోవాలని ఆశ'
"విపక్షాలు ఓట్ల కోసం అర్రులు చాస్తున్నాయి. జాతీయవాదులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉగ్రవాదులు, పాకిస్థాన్ తరఫున మాట్లాడుతున్నారు. మోదీని తక్కువ చేసి చూపించడం, ఓటర్లను సంతోషపెట్టడమే వారి లక్ష్యం. మమత బెనర్జీ వంటివారు మెరుపు దాడులపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. వైమానిక దాడులకు, సైన్యం త్యాగాలకు రుజువులు కావాలంటున్నారు. మమత స్నేహితులైన కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల ముందు ఏడ్చేది. చాలామంది నేతల పేర్లు ప్రధాని రేసులో వినిపిస్తున్నాయి. 40 సీట్ల కోసం పోటీ పడేవారు ప్రధానమంత్రి అవుతానంటున్నారు. 20 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపేవారూ ప్రధాని పదవిని చేపడతానంటున్నారు. 25 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీలో నిలిచే పార్టీలూ ప్రధాని పదవిపై ఆశపడుతున్నాయి. ఇంతమంది రేసులో ఉన్నారు. ఎవరు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడేది? ఉగ్రవాదుల్ని మట్టుబెట్టగలిదింది ఎవరు?"
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: మహీంద్ర ఆమె ఫొటో కోసం అంత వెతికారా..?