కరోనా సంక్షోభం నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాల పార్లమెంటరీ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. లాక్డౌన్ కొనసాగించాలా.. ఎత్తేయాలా అనే అంశమై నేతలతో సంప్రదింపులు జరిపారు ప్రధాని. ఈ సమావేశం నిర్ణయాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఆర్థిక పరిస్థితిపై..
లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితిపై పడే ప్రతికూల ప్రభావంపైనా నేతలు చర్చించారు. అత్యవసర నిధులను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు నేతలకు వివరించారు మోదీ. లాక్డౌన్ కారణంగా రోజు కూలీలు కష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారికోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు.