తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నరేంద్రుడి నోట 'జై శ్రీరామ్' మాట - UP

ఎన్నికల ప్రచారంలో ప్రతిసారి 'భారత్​​ మాతాకీ జై' అని ప్రసంగాన్ని ముగించే ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి 'జై శ్రీరామ్'​ అని నినదించారు. ఉత్తరప్రదేశ్​ ఆయోధ్య ప్రాంతం అంబేడ్కర్​ నగర్​లో ఎన్డీఏ ర్యాలీలో ఇలా అనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నరేంద్రుడి నోట 'జై శ్రీరామ్' మాట

By

Published : May 1, 2019, 3:26 PM IST

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జాతీయవాదం, దేశభద్రత, హిందుత్వాన్ని భాజపా ప్రధానాంశాలుగా చేసుకుందన్నది నిపుణుల మాట. ఈ విశ్లేషణలకు ఊతమిస్తూ... ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్య ప్రాంతంలోని అంబేడ్కర్​ నగర్​లో నిర్వహించిన ప్రచార సభలో... తన ప్రసంగాన్ని "జై శ్రీ రామ్​", "భారత్​ మాతా కీ జై" నినాదాలతో ముగించారు మోదీ.

సాధారణంగా మోదీ ప్రసంగాలన్నీ "భారత్​ మాతా కీ జై" నినాదాలతో ముగుస్తాయి. అయోధ్య ప్రాంతంలో జరిగిన సభలో మాత్రం రాముడ్ని ప్రస్తావించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతామని భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

నరేంద్రుడి నోట 'జై శ్రీరామ్' మాట

ఇదీ చూడండి: 'వారిది మాటల ప్రభుత్వం- మాది చేతల సర్కార్​'

ABOUT THE AUTHOR

...view details