తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాజ్​మహల్​కు ట్రంప్​తో మోదీ వెళ్లరట! - ట్రంప్​ భారత్​ పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆగ్రా పర్యటనలో మోదీ పాల్గొనరని అధికారిక వర్గాల సమాచారం. ట్రంప్​ తాజ్​మహల్ సందర్శించే సమయంలో భారత్​ తరఫున ఏ అధికారి కూడా అక్కడ ఉండరని తెలుస్తోంది.​

Modi unlikely to visit Taj Mahal with Trump: sources
తాజ్​మహల్​కు ట్రంప్​తో మోదీ వెళ్లరట!

By

Published : Feb 22, 2020, 12:36 PM IST

Updated : Mar 2, 2020, 4:11 AM IST

భారత్​ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈ నెల 24న ఆగ్రాలోని తాజ్​మహల్​ను సందర్శించనున్నారు. అయితే ట్రంప్​ వెంట భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లే అవకాశం లేదని అధికారిక వర్గాల సమాచారం.

కుటుంబం, ఉన్నతాధికారుల బృందంతోనే ట్రంప్​ తాజ్​మహల్​ను సందర్శించనున్నట్టు తెలుస్తోంది.

తాజ్​మహల్​ సందర్శనలో ఎన్నో చారిత్రక విషయాలను అమెరికా అధ్యక్షుడు తెలుసుకునే అవకాశముంటుందని... ఇందులో ఎలాంటి అధికారిక చర్చలు జరగవని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. భారత్​ తరఫున అధికారులెవ్వరూ తాజ్​మహల్​కు వెళ్లకపోవచ్చన్నారు.

ఈ నెల 24 మధ్యాహ్నం గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చేరుకుంటుంది ట్రంప్​ బృందం. అక్కడ జరగబోయే భారీ రోడ్​ షో, 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమం అనంతరం ఆగ్రాకు వెళ్లనున్నారు అమెరికా అధ్యక్షుడు. తాజ్​మహల్​ సందర్శన అనంతరం దేశ రాజధాని దిల్లీకి చేరుకుంటారు.

ఇదీ చూడండి:-నమస్తే ట్రంప్​: 'మోటేరా' విశేషాలు ఎన్నో.. మరెన్నో

Last Updated : Mar 2, 2020, 4:11 AM IST

ABOUT THE AUTHOR

...view details