ప్రధాని నరేంద్ర మోదీ.. గొప్ప నేత మాత్రమే కాదు ఎందరో భారతీయులకు ఓ ఫ్యాషన్ ఐకాన్. సందర్భాన్ని బట్టి ప్రత్యేక వస్త్రధారణలో దర్శనమిస్తుంటారు మోదీ. స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో ఏదో ఒక నేపథ్యాన్ని తీసుకుని దుస్తుల్ని ఎంపిక చేస్తారు. ముఖ్యంగా ఆయన ధరించే తలపాగాపై ఎక్కువ చర్చ జరుగుతుంది.
74వ స్వాతంత్య్ర వేడుకల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు మోదీ. కాషాయం, లేత పసుపు రంగుల్లో రూపొందించిన తలపాగాను ఈ ధరించారు. ఇది రాజస్థానీ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలా రంగురంగుల్లో ఉండే తలపాగాను 'సఫా' అంటారు.
స్వాతంత్య్ర వేడుకలు-2020లో.. దుస్తుల విషయానికి వస్తే.. క్రీమ్ కలర్ కుర్తా, కాషాయ రంగు బార్డర్ ఉన్న కండువా వేసుకున్నారు.
ప్రధానిగా మొదటి సారి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న నాటి నుంచి మోదీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
2015 గణతంత్ర వేడుకల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ప్రధాని మోదీ 2016లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ 2017లో జెండా వందనం చేస్తున్న మోదీ 2018లో జెండా వందనం చేస్తున్న మోదీ 2019లో జెండా వందనం చేస్తున్న మోదీ 2019 స్వాతంత్య్ర వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తూ.. 2020 గణతంత్ర వేడుకల్లో ఇలా..