తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుట్టిన రోజున అమ్మ ఆశీర్వాదం తీసుకున్న మోదీ - మోదీ

గుజరాత్ గాంధీనగర్​లోని తన మాతృమూర్తి నివాసానికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తల్లి హీరాబెన్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

పుట్టిన రోజున అమ్మ ఆశీర్వాదం తీసుకున్న మోదీ

By

Published : Sep 17, 2019, 4:15 PM IST

Updated : Sep 30, 2019, 11:05 PM IST

పుట్టిన రోజున అమ్మ ఆశీర్వాదం తీసుకున్న మోదీ

నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా గుజరాత్​లోని గాంధీ నగర్​లో నివాసముంటున్న తన మాతృమూర్తి హీరాబెన్​ వద్దకు వెళ్లారు. కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు. మోదీకి మిఠాయిలు తినిపించారు హీరాబెన్.

అంతకు ముందు గుజరాత్​లోని కేవడియాలో పర్యటించారు మోదీ. సర్దార్​ సరోవర్ డ్యామ్​ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సర్దార్​ సరోవర్​ ఆనకట్టను సందర్శించిన మోదీ

Last Updated : Sep 30, 2019, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details