ప్రధాని పర్యటన నేపథ్యంలో వారణాసిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మోదీ సందర్శించే ప్రదేశాల్లో పారామిలిటరీ, ప్రత్యేక రక్షణ బృందాలను మోహరించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మోదీ.
నేడు కాశీలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన - kashi
సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. ఆయనపై నమ్మకముంచి మరోసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మోదీ వెళుతున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శిస్తారు.
నరేంద్రమోదీ
వారణాసి నుంచి ఎస్పీ అభ్యర్థి షాలిని యాదవ్పై 4.79 లక్షల మెజారిటీతో గెలుపొందారు మోదీ. సిట్టింగ్ ఎంపీగా బరిలోకి దిగిన మోదీ గత ఎన్నికలతో పోలిస్తే లక్ష మెజారిటీ అదనంగా పెంచుకున్నారు.
ఇదీ చూడండి: మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ