తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపే అమేఠీకి మోదీ

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్​ కంచుకోట అమేఠీలో ఆదివారం ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం అమేఠీలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఆదివారం అమేఠీలో మోదీ పర్యటన

By

Published : Mar 2, 2019, 8:01 PM IST

ఉత్తరప్రదేశ్​ అమేఠీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ముందుగా బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం ఆయుధ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠీలో ప్రధాని మోదీ పర్యటించడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. అయితే యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్​బరేలీలో మాత్రం గత డిసెంబర్​లో మోదీ పర్యటించారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోట అయిన అమేఠీలో మోదీ పర్యటన భాజపా కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఆశిస్తున్నారు.

యోగి పర్యవేక్షణ

మోదీ పర్యటన నేపథ్యంలో గతవారం అమేఠీలో పర్యటించిన యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇదీ కార్యక్రమం

ఆదివారం గౌరీగంజ్​లోని కౌహర్​లో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులతోపాటు మున్షిగంజ్ ఆర్డ్​నెన్స్​ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. ఈ కర్మాగారంలో రష్యా భాగస్వామ్యంతో అస్సాల్ట్​ రైఫిల్స్​ తయారుచేస్తారు.

గతంలో...

2014 సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో కాంగ్రెస్​ నేత సోనియా గాంధీపై భాజపా అభ్యర్థి స్మృతీ ఇరానీ పోటీ చేశారు. ఆమెకు మద్దతుగా అమేఠీ లోక్​సభ నియోజకవర్గంలో మే 5న మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో భాజపా సుమారు 3 లక్షల ఓట్లు సాధించగలిగింది.

భాజపా కొత్త ఆశలు

2017 ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అమేఠీలోని ఐదు స్థానాల్లో భాజపా 4 స్థానాలను కైవసం చేసుకుంది. ఎస్పీ 1 స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్​ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఈ ఫలితాలు భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి.

ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరలా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని స్మృతీ ఇరానీ భావిస్తున్నారు. కనుక ప్రస్తుతం మోదీ అమేఠీ పర్యటన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుందని భాజపా ఆశిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details