తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై పోరులో ప్రజలకు రేపు మోదీ వీడియో సందేశం - భారతదేశంలో కరోనా వైరస్

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ... దేశ ప్రజలకు రేపు సందేశం ఇవ్వనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు దేశ ప్రజలతో ఓ చిన్న వీడియో సందేశాన్ని పంచుకోనున్నట్టు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు.

PM-VIRUS-VIDEO MESSAGE
మోదీ

By

Published : Apr 2, 2020, 6:42 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రధాన నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు పాటించాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు దేశ ప్రజలతో ఓ చిన్న వీడియో సందేశాన్ని పంచుకోనున్నట్లు ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.

అంతకుముందు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,965కు చేరుకుంది. కరోనా బారిన పడి 50 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:'ప్రతి ప్రాణం విలువైందే.. యుద్ధ ప్రాతిపదికన పనిచేయండి'

ABOUT THE AUTHOR

...view details