కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు ప్రధాని మోదీ. వారికి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు వివరించనున్నారు. మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు దాదాపు 100 మందితో పాటు.. కొందరు కీలక మంత్రులూ హాజరుకానున్నారు. దిల్లీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి ఈ భేటీలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అజెండాను పంచుకోనున్నారు మోదీ. కొందరు ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలూ సేకరించనున్నారు.
2014లోనూ తొలిసారి ప్రధానిగా ఎన్నికైన అనంతరం మోదీ.. ఇలాంటి సమావేశమే నిర్వహించారు. తర్వాత వివిధ సందర్భాల్లో మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో వేర్వేరుగా భేటీ అయ్యారు.