రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. వ్లాదివోస్తోక్ విమానాశ్రయంలో గౌరవ వందనం స్వీకరించారు మోదీ. రష్యాలో జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రధాని ట్వీట్ చేశారు.
మోదీ నేడు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ పర్యటనతో భారత్- రష్యా సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.