ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో టీకా లబ్ధిదారులతో శుక్రవారం సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా జరగనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన ప్రజలు.. వారి అనుభవాలను మోదీతో పంచుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్.. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద టీకా డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో టీకా లబ్ధిదారులతో సంభాషణ అనంతరం.. శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులతో మోదీ.. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంపై చర్చించనున్నారు.