తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు వారణాసికి ప్రధాని మోదీ.. రేపే నామినేషన్​

ఉత్తరప్రదేశ్​లోని వారణాసికి నేడు వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం గంగా హారతిలో పాల్గొంటారు. రేపు వారణాసి లోక్​సభ స్థానానికి నామినేషన్​ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి బిహార్​​ సీఎం నితీశ్ కుమార్​​, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే సహా శిరోమణి అకాలీ దళ్​, ఎల్​ఎస్​పీ ముఖ్యనేతలు హాజరు కానున్నారు. కేంద్రమంత్రులు, భాజపా నేతలు పాల్గొననున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Apr 25, 2019, 5:03 AM IST

Updated : Apr 25, 2019, 6:46 AM IST

నేడు వారణాసికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రేపు నామినేషన్​ దాఖలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. నేడు ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3గంటలకు మోదీ రోడ్​షో... వారణాసిలోని బనారస్​ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు మదన్​ మోహన్​ మాలవ్యా విగ్రహం వద్ద ప్రారంభమవుతుందని భాజపా వర్గాలు తెలిపాయి. సాయంత్రం 7 గంటలకు దశాశ్వమేథ ఘాట్​ వద్ద రోడ్​షో ముగియనుంది. అక్కడ ప్రధాని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. గంగా హారతి సమర్పిస్తారు.

రేపు నామినేషన్​

వారణాసి లోక్​సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు నామినేషన్​ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 9గంటలకు భాజపా కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు మోదీ. అనంతరం నామపత్రాల దాఖలు కోసం ఊరేగింపుగా వెళతారు.

ఎన్డీఏ ఐక్యత ప్రదర్శన

మోదీ నామినేషన్​ కార్యక్రమాన్ని ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యతను ప్రదర్శించేందుకు వినియోగించుకోవాలని భావిస్తోంది భాజపా. ఈ కార్యక్రమానికి బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధినేత నితీశ్​ కుమార్​, శిరోమణి అకాలీ దళ్​ నేత, పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్​ సింగ్​ బాదల్​, లోక్​జన శక్తి పార్టీ నేత రామ్​ విలాస్​ పాశ్వాన్​, శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే హాజరుకానున్నారు.

అలాగే కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్​, పియూష్​ గోయల్​, జేపీ నడ్డా, నితిన్​ గడ్కరి సహా భాజపా ముఖ్యనేతలు మోదీ నామినేషన్​ కార్యక్రమంలో పాల్గొంటారు.

2014 ఎన్నికల్లో వారణాసి లోక్​సభ స్థానం నుంచి ఆమ్​ఆద్మీ అధ్యక్షుడు అరవింద్​ కేజ్రివాల్​పై దాదాపు మూడు లక్షల ఓట్ల మోజార్టీతో గెలుపొందారు నరేంద్రమోదీ.

ఈసారి మోదీపై కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Last Updated : Apr 25, 2019, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details