రెండో రోజుల విదేశీ పర్యటనలో భాగంగా నేడు శ్రీలంకకు వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ కానున్నారు. ఆ దేశ ప్రతిపక్ష నేత మహీంద రాజపక్సతోనూ సమావేశమవుతారు. ఆ తర్వాత తమిళ జాతీయ కూటమి నాయకులను కలుస్తారు.
శ్రీలంకలో నేడు ప్రధాని మోదీ పర్యటన - foreign tour
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకలో నేడు పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో సమావేశం కానున్నారు. రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా శనివారం మాల్దీవుల్లో పర్యటించారు మోదీ.
నేడు శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటన
రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనలో భాగంగా శనివారం మాల్దీవులను సందర్శించారు మోదీ. రెండో రోజు శ్రీలంక వెళ్తున్నారు. సాయంత్రం తిరిగి స్వదేశానికి చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
ఇదీ చూడండి: విహారి: ఆ ఆలయంలో పూజలన్నీ ప్రకృతికే