భారత్‌కు వెంటిలేటర్లు విరాళంగాఇస్తున్నట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వంటి కష్టకాలంలో అందరూ కలిసి పనిచేయాలని ట్వీట్ చేశారు.
"ధన్యవాదాలు ట్రంప్. ఈ మహమ్మారిపై మనం అందరం కలిసి పోరాడుతున్నాం. ఇలాంటి సమయాల్లో.. దేశాలన్నీ కలిసి పని చేయడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యవంతమైన, కరోనా రహితంగా ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి సాయశక్తులా కృషి చేయాలి. భారత్-అమెరికా మైత్రి మరింత బలపడాలి."