ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఏప్రిల్ 9న ఒకే వేదికను పంచుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం భాజపా, శివసేన పొత్తు పెట్టుకున్నాక వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం చేయడం ఇదే మొదటిసారి.
మోదీ, ఉద్ధవ్ ఇరువురూ మహారాష్ట్రలోని లాతూరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని, భాజపా అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్ తెలిపారు.
చివరిసారిగా...
అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ మెమోరియల్‌కు 2016 డిసెంబర్లో శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంలోనే ప్రధాని మోదీ, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చివరిసారిగా వేదిక పంచుకున్నారు. తిరిగి ఈ ఎన్నికల ప్రచారంలోనే వారు కలవనున్నారు.
నాందేడ్‌లో...
నాందేడ్‌లో భాజపా అభ్యర్థి ప్రతాప్ చిఖాలికర్ తరపున ప్రధాని మోదీ శనివారంప్రచారం చేశారు. ఈ స్థానం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ పోటీ చేస్తున్నారు.