బ్రిటన్ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన బోరిస్ జాన్సన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు బోరిస్‌తో ఫోన్లో సంభాషించారు మోదీ. రెండో సారి భారత్‌కు ప్రధానిగా ఎన్నికైన మోదీకి కూడా బోరిస్ శుభాకాంక్షలు చెప్పారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్‌తో మోదీ ఫోన్ సంభాషణ - మోదీ
బ్రిటన్ నూతన ప్రధాని బోరిస్ జాన్సన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో సంభాషించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.
బోరిస్‌తో మోదీ
చర్చలో భాగంగా చాలా అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడినట్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆగస్టు 15న లండన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్న భారతీయులపై దాడిని బోరిస్‌తో ప్రస్తావించారు మోదీ. ఈ హింసాత్మక ఘటనపై బోరిస్ స్పందన కోరారు మోదీ.
ఈ ఘటనపై బోరిస్ విచారం వ్యక్తం చేశారు. భారత హైకమిషన్, అందులోని అధికారులు, పర్యటకులకు పూర్తి భద్రత కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
Last Updated : Sep 27, 2019, 5:17 PM IST