తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్​సీఓ సమావేశానికి బిష్కెక్​ బయల్దేరిన మోదీ - ఎస్​సీఓ

కిర్గిస్థాన్‌లో జరిగే షాంఘై సహకార సమాఖ్య సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బిష్కెక్ బయల్దేరారు.  బిష్కెక్‌లో నేడు, రేపు సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని పాక్  గగనతలం మీదుగా కాకుండా ఒమన్ , ఇరాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్ చేరుకుంటారు.

ఎస్​సీఓ సమావేశాలకు బిష్కెక్​ బయల్దేరిన మోదీ

By

Published : Jun 13, 2019, 10:16 AM IST

Updated : Jun 13, 2019, 10:58 AM IST

షాంఘై సహకార సమాఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​ బయల్దేరారు. ఈ సమావేశాల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

బిష్కెక్ బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేసిన ప్రధాని మోదీ ఈ పర్యటన ఎస్​సీఓ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రపంచ భద్రత స్థితిగతులు, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశాల్లో వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు.

బిష్కెక్​లో నేడు, రేపు సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని పాక్​ గగనతలం మీదుగా కాకుండా ఒమన్​, ఇరాన్​తో పాటు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్​ చేరుకుంటారు.

ఎస్​సీఓ సమావేశానికి బిష్కెక్​ బయల్దేరిన మోదీ
Last Updated : Jun 13, 2019, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details